: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు డ్రైవర్లు మృతి
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... ఏర్పేడు మండంలంలోని రాచగున్నేరు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్లిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 20 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.