: జగన్ కోరుకోవడంలో తప్పులేదు: జేసీ దివాకర్ రెడ్డి


నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లోను ప్రత్యేక హోదా రాదని టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు. ఏపీకి ప్యాకేజీలే గతి అని స్పష్టం చేశారు. వైకాపా అధినేత జగన్ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరుకోవడంలో తప్పులేదని... అయితే, దాన్ని ఇచ్చే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాయల తెలంగాణ అంశాన్ని తాను తెర మీదకు తెచ్చానని... కానీ, తనకు ఎవరూ మద్దతు పలకలేదని తెలిపారు. ప్రత్యేక రాయలసీమ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం వృథా అని, కేవలం రాజకీయ నిరుద్యోగులు మాత్రమే దీని గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News