: తమిళనాడుకు వరద సాయం కింద రూ.940 కోట్లు విడుదల


తమిళనాడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ వరద సాయం ప్రకటించింది. ఈ మేరకు రూ.940 కోట్లు విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారులను ఆదేశించారు. కాగా సీఎం జయలలిత తమకు వరద సాయం కింద తక్షణమే రూ.2వేల కోట్లు విడుదల చేయాలని లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆర్థిక సాయం విడుదల చేసింది. ఇదిలాఉంటే ఆంధ్రప్రదేశ్ కు తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరుతూ నాలుగు రోజుల కిందట ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అయితే, ఇంతవరకు రాష్ట్రానికి కేంద్రం ఏ సాయం ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News