: ఈ కారణాల వల్లే చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు అభిమానిని అయ్యా: వర్మ
ఇటీవలి కాలంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై వరుసగా ట్వీట్లు చేస్తూ చర్చనీయాంశంగా మారాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అయితే, ఈ ఇద్దరిపై తనకు ఎంతో అభిమానం ఉందని, వాళ్లకు తాను ఫ్యాన్ అని వర్మ చెప్పాడు. ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వూలో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా స్పందించాడు. చిరంజీవి సినిమాలను తాను టికెట్ కొనుక్కుని చూసేవాడినని... అప్పటి నుంచే తాను చిరంజీవికి పెద్ద అభిమానినని చెప్పాడు. పవన్ కల్యాణ్ సినిమాలను తాను ఎక్కువగా చూడలేదని... కానీ, పవన్ వ్యక్తిగతంగా చాలా గొప్పవాడని, అందుకే ఆయనకు తాను అభిమానిని అయ్యానని తెలిపాడు. జనసేన ప్రారంభించినప్పుడు కానీ, ఆ తర్వాత అనేక సందర్భాల్లో కాని పవన్ మాట్లాడినప్పుడు ఆయనలో పెల్లుబికిన భావాలు అద్భుతమని చెప్పాడు.