: ఆల్ ఖైదా దాడులు జరగొచ్చు!... ఐబీ హెచ్చరికలతో అప్రమత్తమైన రాష్ట్రాలు


దేశంలోని చారిత్రక స్థలాలు, పర్యాటక ప్రాంతాలపై ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు ఐబీ అధికారులు అన్ని రాష్ట్రాల డీజీపీలు, నగరాల పోలీస్ కమిషనర్లను అప్రమత్తం చేశారు. ఏ క్షణంలోనైనా, ఏ ప్రాంతంపైనైనా దాడులకు తెగబడేందుకు ఆల్ ఖైదా ఉగ్రవాదులు పన్నాగం పన్నుతున్నారు, అప్రమత్తంగా ఉండాలని ఐబీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలపై నిత్యం నిఘా వేసి ఉంచాలని కూడా సూచించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రముఖ పర్యాటక కేంద్రాలు, చారిత్రక స్థలాల్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News