: ఇకపై సిరా చుక్కకు బదులుగా మార్కర్ గుర్తు... పరిశీలిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల్లో ఓటు వేశాక చూపుడు వేలుపై ఇప్పటివరకు సిరాను అద్దుతున్నారు. ఇందుకోసం ఇంకు వాడుతూ వస్తున్నారు. దాని స్థానంలో ఇక నుంచి మార్కర్ పెన్ రాబోతుంది. త్వరలోనే వాటిని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. మైసూర్ పెయింట్స్ సరఫరా చేస్తున్న ఆ మార్కర్లను ప్రస్తుతం ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. 1962 నుంచి వాడుతున్న సిరాను వేలికి అంటించడం అంత బాగాలేదని అభిప్రాయపడుతున్న యువత అభ్యర్థనను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుని, ఈ మార్కర్లను పరిశీలిస్తోందట. "మార్కర్ల వినియోగంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ప్రస్తుతానికైతే వాటిని పరీక్షిస్తున్నాం. అందులో వచ్చే ఫలితాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటాం" అని ఈసీ అధికారి ఒకరు చెప్పారు.