: 'స్వచ్ఛ ఢిల్లీ' యాప్ కు ఫిర్యాదుల వెల్లువ


ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన 'స్వచ్ఛ ఢిల్లీ' యాప్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల వివరాలను ప్రజలు పెద్ద సంఖ్యలో పంపిస్తున్నారు. కేవలం వారం రోజుల్లో 13 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నుంచి ఈ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతం నుంచి దాదాపు 4,400 ఫిర్యాదులు వచ్చాయని, నార్త్ కార్పొరేషన్ నుంచి 3,200, ఈస్ట్ కార్పొరేషన్ నుంచి 2,600 ఫిర్యాదులు వచ్చినట్టు వెల్లడించారు. అయితే కొంతమంది ఆకతాయిలు వారి సెల్ఫీలను కూడా పంపుతున్నాయని అధికారులు చెప్పారు. ఈ యాప్ ను ఇప్పటివరకు 60వేల మందికి పైగా యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News