: తెలంగాణ బీజేపీకి యెన్నం శ్రీనివాసరెడ్డి రాజీనామా


తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత యెన్నం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. కొంతకాలం నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి స్థాపించిన బచావో మిషన్ తెలంగాణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. అయితే ఇంత అకస్మాత్తుగా యెన్నం పార్టీని ఎందుకు వీడుతున్నారనేది తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News