: ర్యాగర్లకు మంత్రి గంటా తీవ్ర హెచ్చరికలు!
జూనియర్లను ర్యాగింగ్ చేస్తూ, పైశాచిక ఆనందాన్ని పొందే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టబోమని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్ హెచ్చరించారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై గంటా స్పందిస్తూ, విద్యార్థుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలిస్తున్నామని, ర్యాగర్లను కళాశాల నుంచి బయటకు పంపేందుకు కూడా వెనుకాడబోమని ఆయన అన్నారు. ఆ పరిస్థితి తెచ్చుకుని బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. తాను రేపు స్వయంగా వర్శిటీకి వెళ్లి విద్యార్థులను స్వయంగా విచారించనున్నానని తెలిపారు.