: 18 ఏళ్ల భారత యువ కిరణం... 140 కి.మీ స్పీడ్ స్టర్!


అతని పేరు అవేష్ ఖాన్. భారత అండర్ 19 క్రికెట్ జట్టులో బౌలర్. నిన్నటి వరకూ అతని పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. ఒక్క రోజులో అతను స్టార్ అయిపోయాడు. మూడు దేశాల అండర్ -19 ట్రై సిరీస్ లో భాగంగా, బంగ్లాదేశ్-ఏతో జరిగిన మ్యాచ్ లో కేవలం 4 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతేకాదు, పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో, మన పేస్ బౌలర్లలో చాలా మందికి సాధ్యంకాని వేగాన్ని నమోదు చేశాడు. అవేష్ తన బౌలింగ్ లో 139.8 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నాడు. అంత వేగంతో అవేష్ బంతులేస్తుంటే, ప్రత్యర్థి ఆటగాళ్ల వద్ద సమాధానం లేకపోయింది. జాదవ్ పూర్ లో బంగ్లాదేశ్ లో జరిగిన మ్యాచ్ లో ఇండియా 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇతని వయసు 18 సంవత్సరాలు మాత్రమే. ఆరు ఓవర్లు వేసిన అవేష్ 3 మెయిడెన్లు వేసి నాలుగు వికెట్లు తీశాడు. నీ ఆరాధ్య క్రికెటర్ ఎవరంటే, ఎవరి పేరూ చెప్పకుండా, తాను ఎంతో మంది ఆటను చూస్తూ పెరిగానని, తాను ప్రత్యేకంగా ఉండాలన్నదే తన అభిమతమని చెబుతున్నాడు. బౌలింగ్ లో మరింత వేగాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్టు చెబుతున్నాడు. మీడియం పేసర్ గా ఉండటం తనకిష్టం లేదని, ఫాస్ట్ బౌలింగే తనకు ఇష్టమని చెబుతున్న అవేష్ కు ఆల్ ది బెస్ట్!

  • Loading...

More Telugu News