: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది!: ఎంపీ కవిత


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదుల సంఖ్యలో విద్యా సంస్థలను కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆరోపించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హైకోర్టు అంశాన్ని కేంద్రం మరచిపోయిందన్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో ఒత్తిడి తెస్తానని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి గురించి వరంగల్ ఉప ఎన్నిక ప్రచార సభలో బీజేపీ నేత కిషన్ రెడ్డి ఉపన్యాసాలు బాగానే ఇచ్చారన్నారు. ప్రజల ముందు మాట్లాడటం కాదని ఈ విషయాన్ని ప్రధాన నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించి తెలంగాణ అభివృద్ధికి ఆయన పాటుపడాలని, ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కోసం కిషన్ రెడ్డి కృషి చేయాలని కవిత సూచించారు.

  • Loading...

More Telugu News