: స్నేహమనేది స్వచ్ఛమైన చిరునవ్వులా ఉండాలి: ప్రధాని మోదీ
స్నేహమనేది... మనస్ఫూర్తిగా నవ్వే చిరునవ్వులా స్వచ్ఛంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సుమారు 20 వేల మంది భారత సంతతి ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, మలేషియా ప్రజలు తన పట్ల చూపుతున్న అభిమానాన్ని, ఆదరణను తానెప్పటికీ మరువలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారత సంతతి ప్రజలు రాణిస్తున్నారన్నారు. భారత అభివృద్ధిలో తమిళ ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. స్వాతంత్ర్య పోరాట యోథుడు సుభాష్ చంద్ర బోస్ భారత సంస్కృతికి కేంద్ర బిందువు అని మోదీ అన్నారు.