: చంద్రబాబు ఆదేశాలను లెక్కచేయని అధికారులు!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను అక్కడి అధికారులు బేఖాతర్ చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 22 మంది ఐఏఎస్ అధికారులను ముఖ్యమంత్రి నియమించారు. అయితే, చంద్రబాబు పర్యటిస్తున్న గ్రామాల్లో ఆ అధికారులు కనిపించకపోవడంపై పలు విమర్శలు తలెత్తాయి. కేవలం సమీక్షలకే వారు పరిమితమవుతున్నారని స్థానికులు, విపక్షపార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. వరదనష్టం, ప్రస్తుత పరిస్థితి గురించిన వివరాలను ఆయన తెలుసుకోనున్నారు.

  • Loading...

More Telugu News