: మహిళా టీచర్లను అన్ని విధాలా ఆదుకుంటాం: డిప్యూటీ సీఎం కడియం
మహిళా టీచర్లను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మహిళా టీచర్ల జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ, గ్రామాల్లో బాలికలు పాఠశాలకు వచ్చేలా మహిళా టీచర్లు చొరవ తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వారు పనిచేయాలని సూచించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రభుత్వంతో పాటు మహిళలు పాటుపడాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సమష్టిగా పోరాడాలని కడియం పిలుపు నిచ్చారు.