: పోలీస్ కానిస్టేబుళ్లకు, మాజీ సైనికులకు ఇళ్లు కట్టిస్తాం: కేసీఆర్
ప్రజాప్రతినిధుల కోటా నుంచి పోలీస్ వ్యవస్థ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రతి ఏడాది పోలీస్ కానిస్టేబుళ్లకు, మాజీ సైనికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పదిశాతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాదు బంజారాహిల్స్ లో పోలీస్ ట్విన్ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ కేంద్రానికి రూ. 320 కోట్లు ఇచ్చామని, వచ్చే బడ్జెట్ లో మరో రూ.700 కోట్లు కేటాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్శింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.