: మన దగ్గర మంచి పోలీసాఫీసర్లు ఉన్నారు: కేసీఆర్


తెలంగాణలో మంచి పోలీసు ఆఫీసర్లు ఉన్నారని, కాలానుగుణంగా పోలీసులు కూడా మారారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ‘కమాండ్ కంట్రోల్’కు శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. పోలీసు ట్విన్ టవర్స్ గురించి మాట్లాడుతూ ఇందుకుగాను రూ.320 కోట్లు మంజూరు చేశామన్నారు. రెండు కంట్రోల్ టవర్లలో మొదటి టవర్ లో 24 అంతస్తులు, రెండో టవర్లో 17 అంతస్తులు ఉంటాయన్నారు. హైదరాబాద్ లో మరో పదివేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. సీసీ కెమెరాల కొనుగోలు నిమిత్తం ప్రభుత్వమే నిధులిస్తుందన్నారు. టెక్నాలజీ సాయంతో మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఎంతో ఉందని కేసీఆర్ సూచించారు. నేరాల నివారణకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. తప్పంతా పోలీసులదే అన్నట్లుగా ప్రజలు వ్యవహరించకూడదని సూచించారు. గతంలో ఇక్కడ పనిచేసిన పోలీసు డీజీపీలు కూడా చాలా బాగా పనిచేశారని ఆయన ప్రశంసించారు.

  • Loading...

More Telugu News