: విపక్ష నేతలను ఉరి తీసిన బంగ్లా...క్షమాభిక్ష పిటిషన్ల తిరస్కరణ మరుక్షణమే శిక్ష అమలు


యుద్ధ నేరాలకు సంబంధించి దోషులుగా తేలిన ఇద్దరు ప్రతిపక్ష నేతలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉరి తీసింది. 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో దేశ విద్రోహ చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎరుర్కొంటున్న జమాతే ఇస్లామీ సెక్రటరీ జనరల్ అలీ హసన్ మొహమ్మద్ ముజాహిద్ (67), బీఎన్పీ నేత సలావుద్దీన్ ఖాదర్ చౌధురి (66) లపై నేరాభియోగాలు రుజువయ్యాయి. దీంతో వీరిద్దరికీ ఇటీవలే మరణశిక్ష ఖరారు చేస్తూ బంగ్లా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తమకు క్షమాభిక్ష పెట్టాలని దోషులిద్దరూ బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ క్షమాభిక్ష పిటిషన్లను అన్సారీ నిన్న రాత్రి తోసిపుచ్చారు. దోషులకు క్షమాభిక్ష పెట్టేందుకు నిరాకరించారు. అధ్యక్ష భవనం నుంచి క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణకు గురవుతున్నట్లు సమాచారం రాగానే బంగ్లా అధికారులు ఢాకా సెంట్రల్ జైలులో దోషులిద్దరినీ నిన్న రాత్రి 12.45 గంటలకు ఉరి తీశారు.

  • Loading...

More Telugu News