: మయన్మార్ లో భారీ ప్రమాదం...కొండచరియలు విరిగిపడి 60 మంది మృతి, వంద మంది గల్లంతు
భారత్ పొరుగు దేశం మయన్మార్ లో భారీ ప్రమాదం సంభవించింది. గనుల్లో కొండచరియలు విరిగిపడిన ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 60 మంది మృత్యువాత పడ్డారు. మరో వంద మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. మయన్మార్ లోని కచిన్ జిల్లాలో నిన్న సాయంత్రం ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. జిల్లాలోని గనుల్లో తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్న క్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులు పనిలో నిమగ్నమై ఉండగా, కొండచరియలు విరిగిపడ్డాయి. ఊహించని విధంగా విరిగిపడ్డ కొండచరియల నుంచి కార్మికులు తప్పించుకోలేకపోయారు. గల్లంతైన వారి కోసం అక్కడి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.