: లోయలో పడ్డ పెళ్లి బస్సు... కడప జిల్లాలో ఘోర ప్రమాదం
కడప జిల్లాలో నేటి ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో బయలుదేరిన ఓ బస్సు ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకెళితే, పెద్దపసుపుల నుంచి పెళ్లి నిమిత్తం పులివెందులకు ఓ బృందం బస్సులో బయలుదేరింది. ముద్దనూరు ఘాట్ లో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. అయితే అటుగా వెళుతున్న ప్రయాణికులు ప్రమాదాన్ని గమనించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు.