: కుట్ర గురించి కఠారి మోహన్ కు ముందే తెలుసట... తేలిగ్గా తీసుకుని ప్రాణాలు కోల్పోయారు!
తమపై దాడికి కుట్ర జరుగుతోందని చిత్తూరు మేయర్ అనురాధ భర్త కఠారి మోహన్ కు ముందే తెలుసట. అయినా ఆయన దీనిని పెద్దగా పట్టించుకోలేదని, ఈ కారణంగానే ఆయన తన భార్య సహా ప్రాణాలు కోల్పోయారని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పుదుచ్చేరి వెళ్లిన సందర్భంగా కఠారి మోహన్ తన మేనల్లుడు చింటూ రాయల్ పై అసహనం వ్యక్తం చేయడమే కాక, ఆ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట. సదరు కామెంట్స్ చింటూకు తెలిశాయని, వాటి కారణంగానే చింటూ పక్కాగా ప్లాన్ చేశాడని ప్రచారం సాగుతోంది. దీనిపై ఓ మహిళా కార్పొరేటర్ నేరుగా టీడీపీ నేతల వద్దకు వచ్చి కుట్ర విషయాన్ని వారికి చెప్పారు. దీంతో మేయర్ అనురాధను హెచ్చరించిన టీడీపీ నేతలు మోహన్ ను జాగ్రత్తగా ఉండేలా చూసుకోమని చెప్పారట. అయితే ఈ హెచ్చరికలను కఠారి మోహన్ అంత సీరియస్ గా తీసుకోలేదు. దీంతో తన ప్రాణాలతో పాటు భార్య ప్రాణాలను కూడా ఆయన కాపాడుకోలేకపోయారని ఆయన అనుచరులు వాపోతున్నారు.