: ఇండోనేసియాలో భూకంపం...సునామీ హెచ్చరికల్లేవు


ఇండోనేసియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. బబర్ ద్వీప సమీపంలో సంభవించిన ఈ భూకంపం సముద్రంలో 67 కిలోమీటర్ల లోతులో వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం వెల్లడించింది. 6.1 తీవ్రతతో సముద్రంలో భూంకంప సంభవించినప్పటికీ సునామీ హెచ్చరికలు లేవని యూఎస్ జీఎస్ తెలిపింది. ఇండోనేసియాలోని సౌమ్లకి అనే నగరంలో 25 సెకన్లపాటు భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలు ఆందోళనతో బయటకు పరుగులు తీశారని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, భూకంపం నష్టంపై పూర్తి వివరాలతో కూడిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News