: వరంగల్ లో గెలుపు కాంగ్రెస్ పార్టీదే: పొంగులేటి


వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అనేక అరాచకాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు. ఓటర్లను టీఆర్ఎస్ నేతలు అనేక ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. మరోవైపు, నీటి ప్రాజెక్టులకు ఇతర శాఖల నిధులను కేటాయిస్తున్నారని... దీనివల్ల ఆర్థిక శాఖ నిర్వీర్యం అవుతుందని అన్నారు. ఈ విషయాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News