: గ్రౌండ్ లో కుప్పకూలిన క్రికెటర్ ఆసుపత్రిలో మృతి


క్రికెట్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నమీబియా-ఆరెంజ్ ఫ్రీ స్టేట్ జట్ల మధ్య నమీబియాలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా నమీబియా జట్టు క్రికెటర్ రేమండ్ వాన్ స్కూర్ (25) మైదానంలో స్ట్రోక్ (పక్షవాతం) కారణంగా కుప్పకూలాడు. దీనిని గమనించిన సహ ఆటగాళ్లు, మ్యాచ్ నిర్వాహకులు రేమండ్ ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల తర్వాత రేమండ్ మృతి చెందాడు. రేమండ్ మృతికి ఆ దేశాధ్యక్షుడు హేగ్ జింగోబ్, పలువురు నేతలు, క్రికెట్ ప్రముఖులు, అతని సహచరులు సంతాపం తెలిపారు. రేమండ్ మృతి పట్ల ఐసీసీ ట్విట్టర్ లో సంతాపం తెలిపింది. ఇటీవలి కాలంలో మైదానంలో పలువురు ఆటగాళ్లు మృత్యువాత పడడం అందరినీ కలచివేస్తోంది.

  • Loading...

More Telugu News