: దీపికా, ప్రియాంకా, రణ్ వీర్ ల 'బాజీరావ్ మస్తానీ' ట్రైలర్ విడుదల


ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లతో ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకున్న 'బాజీరావ్ మస్తానీ' చిత్రం ట్రైలర్ విడుదలైంది. చిత్ర బృందం తమ అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా ట్రైలర్ ను పోస్టు చేసింది. 3 నిమిషాల 5 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ను ఇప్పటికే లక్షా 85వేలకు పైగా వీక్షించారు. మరాఠా సామ్రాజ్య యోధుడు పీష్వా బాజీరావ్-1 జీవిత కథ ఆధారంగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటులు రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News