: యాదాద్రి చుట్టూ నాలుగు లైన్ల రోడ్ల విస్తరణకు నిధుల విడుదల


తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి అభివృద్ధిలో భాగంగా దాని చుట్టూ ఉన్న రోడ్లను నాలుగు లైన్లుగా మార్చేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఆ రోడ్ల నిర్మాణానికి రూ.73 కోట్ల నిధులు విడుదల చేసినట్టు ప్రభుత్వ విప్ సునీతా మహేందర్ రెడ్డి తెలిపారు. యాదాద్రి చుట్టూ ఉన్న తుర్కపల్లి-యాదగిరిగుట్ట, వంగపల్లి-యాదగిరిగుట్ట, రాజపేట-యాదగిరిగుట్ట రోడ్లను నాలుగు లైన్ల రోడ్లుగా విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టు ఆమె చెప్పారు. ఇక భువనగిరి-వరంగల్ హైవే విస్తరణలో భాగంగా వంగపల్లి గ్రామానికి బైపాస్ ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News