: దేవినేని ఉమాను బర్తరఫ్ చేయండి: తమ్మినేని డిమాండ్
అంతులేని అవినీతికి పాల్పడుతున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును వెంటనే బర్తరఫ్ చేయాలని వైకాపా అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. జలవనరుల శాఖలో వందల కోట్ల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు టీడీపీ నేతల వ్యవహారశైలి ఉందని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై సొంత ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాశారని... ప్రభుత్వ అవినీతికి ఈ లేఖే నిదర్శనమని వ్యాఖ్యానించారు. వాటాల్లో లెక్కలు తేలక టీడీపీ నేతలు ఒకరి దోపిడీని మరొకరు బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. అవినీతిపై విచారణ జరిపించే ధైర్యం మీకు ఉందా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు.