: 'తాగొద్దుర భాయీ'.. అంటోన్న గజల్ శ్రీనివాస్


మద్యం మత్తులో వాహనాలు నడిపి, ప్రమాదాలకు గురవుతున్న వ్యక్తుల కోసం ప్రఖ్యాత గాయకుడు గజల్ శ్రీనివాస్ ఓ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. శిరీష్ ముప్పాల అనే ఎన్నారై రచించిన ఈ పాటను గజల్ శ్రీనివాస్ స్వరపరిచారు. సింటిల్లా క్రియేషన్స్ రూపొందించిన ఈ పాట సీడీని నేడు హైదరాబాద్ లోని హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ పాటను అందరికి అంకితం చేస్తున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ఈ చైతన్య గీతాన్ని వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, రద్దీగా ఉండే ట్రాఫిక్ కూడళ్ళ వద్ద ఈ పాటను మొబైల్ వ్యాన్ ద్వారా వినిపిస్తామని గజల్ శ్రీనివాస్ చెప్పారు.

  • Loading...

More Telugu News