: టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డికి స్వల్ప అస్వస్థత... చంద్రబాబు సమక్షంలోనే ఛాతీలో నొప్పి


టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సీఎం నారా చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా పొట్టేపాలెంలో ఉండగా సోమిరెడ్డికి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో వైద్య చికిత్స నిమిత్తం ఆయనను హుటాహుటిన నెల్లూరుకు తరలించారు. సోమిరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రమాదమేమీ లేదని ప్రకటించారు. దీంతో టీడీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. భారీ వర్షం, వరదల నేపథ్యంలో నిన్నటి నుంచి చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నెల్లూరు జిల్లాకే చెందిన సోమిరెడ్డి కూడా చంద్రబాబు వెంటే నిన్నటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు.

  • Loading...

More Telugu News