: ‘డిప్యూటీ’గా పెద్దోడి కంటే చిన్నోడే బెటరంటున్న లాలూ!... కారణాలేంటంటే...!


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి విజయంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రచారమే కీలకం. ఎన్నికల విశ్లేషకులతో పాటు ఆయన ప్రత్యర్థి పార్టీలదీ ఇదే అభిప్రాయం. ఓటర్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే అన్ని పార్టీల కంటే ఆర్జేడీకే అధిక సీట్లిచ్చి ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆ పార్టీని అతిపెద్ద పార్టీగా నిలిపారు. అంటే మెయిన్ స్ట్రీమ్ నుంచి తప్పుకున్నా, ఎన్నికల ఎత్తుగడల్లో లాలూ సత్తా తగ్గలేదన్న మాట. అసలు ఎన్నికల ఎత్తుగడల్లోనే కాదు, తన కుమారుల్లో ఎవరిని ఏ మేరకు ప్రోత్సహించాలన్న విషయంలోనూ లాలూ పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా... డిప్యూటీ సీఎం పదవికి తన ఇద్దరు కుమారుల్లో పెద్దోడి కంటే చిన్నోడికే ఆయన ఓటేశారు. ఇటీవల ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన లాలూ కొడుకుల్లో తేజ్ ప్రతాప్ యాదవ్ పెద్దోడు. తేజస్వీ యాదవ్ చిన్నోడు. ఇద్దరూ నిన్న నితీశ్ కుమార్ కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే చిన్న కుమారుడినే ప్రోత్సహించాలనుకున్న లాలూ... తేజ్ ప్రతాప్ కంటే చిన్నోడైన తేజస్వీకి డిప్యూటీ సీఎం పదవిని ఇప్పించారు. ఇందుకు గల కారణాలేంటంటే... * తేజ్ కంటే తేజస్వీ అంటేనే లాలూకు నమ్మకం ఎక్కువ * క్రికెటర్ గా తేజస్వీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఓ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. * అంతేకాక తేజ్ కంటే కూడా తేజస్వీ మంచి వక్త. స్వీయ నియంత్రణ కలిగిన వాడు. * బీహార్ రాజకీయాలపై తేజస్వీ మంచి పట్టు సాధించారు. అంతేకాక స్టైల్లోనూ తండ్రి లాలూ లాగే కనిపిస్తారు. * పార్టీ కోసం ఆన్ లైన్ లోనే కాక ఆఫ్ లైన్ లోనూ తేజస్వీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. * ప్రధాని నరేంద్ర మోదీపై మాటల దాడి చేయడంలోనూ తేజస్వీ తెగువ చూపించాడు. * సోషల్ మీడియాపై మంచి పట్టున్న తేజస్వీ, సాంకేతికాంశాలపై కూడా మంచి పట్టు సాధించాడు.

  • Loading...

More Telugu News