: ఏపీలో వరద సహాయక చర్యల కోసం బీజేపీ తరపున కోటి విరాళం
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలలోని వరద ప్రాంతాలలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ పర్యటిస్తున్నారు. అంతకుముందు తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. వరద సహాయక చర్యల కోసం బీజేపీ తరపున రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. కాగా మొదటి విడత ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదల పూర్తయిందన్నారు. రెండో విడత నిధులివ్వాలని ప్రధానమంత్రి కార్యదర్శికి సూచించానని, త్వరలోనే ఆ నిధులు కూడా వస్తాయని వెంకయ్య చెప్పారు.