: చంద్రబాబు ఉంటున్నది అక్రమ కట్టడం... ముందు దాన్ని కూల్చండి: వైకాపా
నవ్యాంధ్ర రాజధాని అమరావతి గ్రామాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తామని సీఆర్డీఏ కమిషనర్ చేసిన ప్రకటనపై వైకాపా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమే అని... ముందు దాన్ని కూల్చివేయండని మండిపడ్డారు. చంద్రబాబు నివాసంతో పాటు కరకట్ట మీద బడా బాబులు ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలే అని ఆరోపించారు. రాజధాని కోసం భూములు ఇవ్వక ముందు ఒక మాట, భూములు ఇచ్చిన తర్వాత మరోమాటను చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ రోజు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.