: గుర్తింపు కార్డు లేనందున ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డిని అనుమతించని ఎస్సై
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డిని స్థానిక ఎస్సై రాఘవేందర్ అడ్డుకున్నారు. ధర్మసాగర్ లోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్దకు ఆయన రాగా, ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు చూపాలని ఎస్సై కోరారు. రాజేశ్వర్ రెడ్డి దగ్గర కార్డు లేకపోవడంతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. దాంతో ఎమ్మెల్సీ, ఆయన అనుచరులు వెనుదిరిగారు.