: సొంత రికార్డును బద్దలు కొట్టిన బట్లర్!...46 బంతుల్లోనే శతకం బాదేసిన ఇంగ్లండ్ బ్యాట్స్ మన్
దుబాయి వేదికగా నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. అప్పటికే ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నమోదు చేసుకున్న ఇంగ్లీష్ బ్యాట్స్ మన్ జాస్ బట్లర్ పాక్ బౌలర్లు విసిరిన బంతులను ఎడాపెడా బాదేశాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ కొట్టిన బట్లర్ తన రికార్డును తానే బద్దలు కొట్టేశాడు. అంతేకాక ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన క్రికెటర్ గా మరోమారు రికార్డులకెక్కాడు. మొత్తం 52 బంతులను ఎదుర్కొన్న బట్లర్ 8 సిక్సర్లు, 10 ఫోర్లతో ఏకంగా 116 పరుగులు రాబట్టాడు. బట్లర్ వీరవిహారం చేసిన ఈ సెంచరీ... ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ కాగా, వరల్డ్ క్రికెట్ లో ఆరో ఫాస్టెస్ట్ సెంచరీగా నమోదైంది.