: కర్నూలు జిల్లాలో లారీ బీభత్సం... రోడ్డు దాటుతున్న చిన్నారులపైకి దూసుకెళ్లిన వైనం
కర్నూలు జిల్లాలో నేటి ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న చిన్నారుల పైకి దూసుకెళ్లిన లారీ ముగ్గురు చిన్నారులను పొట్టనబెట్టుకుంది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. పొద్దున్నే రోడ్డు దాటుతున్న బాలికలను వేగంగా దూసుకువచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో బాలికను ఆసుపత్రికి తరలించేలోగానే చనిపోయింది. దీంతో ఈ ఘటనలో మొత్తం ముగ్గురు బాలికలు చనిపోయినట్లైంది. పొద్దున్నే ముగ్గురు బాలికలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.