: పట్టిసీమపై స్వామినాథన్ ప్రశంసలు...చంద్రబాబు చర్యలు బాగున్నాయని కామెంట్


రాయలసీమను రతనాల సీమగా మారుస్తానంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు శాస్త్రవేత్తల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ ప్రాజెక్టు వృథా అంటూ ప్రతిపక్షం వైసీపీతో పాటు ప్రజా సంఘాలు, రాయలసీమ హక్కుల సంఘాలు ఆరోపణలు గుప్పిస్తున్నా... శాస్త్రవేత్తల నుంచి దీనిపై ప్రశంసలు వెల్లువెత్తడం గమనార్హం. పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఏపీ సీఎం చర్యలపై ప్రశంసల వర్షం కురిపించారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని వీఐటీ యూనివర్సిటీలో ‘నదుల అనుసంధానం-జాతీయ జలమార్గాలు’ అన్న అంశంపై నిన్న జరిగిన సదస్సుకు స్వామినాథన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా- గోదావరి నదుల అనుసంధానం కోసం ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న చొరవ అభినందనీయమని కీర్తించారు. దేశంలోని నదులన్నింటినీ అనుసంధానం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందన్నారు. అన్ని రాష్ట్రాల మధ్య ఐక్యత ఉంటే ఈ మహా సంకల్పం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News