: వరంగల్ ఉప ఎన్నిక నేడే... మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం


తెలంగాణలో అధికార టీఆర్ఎస్, విపక్షాల మధ్య హోరాహోరీ పోరుగా సాగుతున్న వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో భాగంగా మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా నిర్విరామంగా కొనసాగనుంది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎన్డీఏ, లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు సహా మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కు సంబంధించి నిన్న సాయంత్రానికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం 15,09,671 మంది ఓటర్లు ఉండగా, వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 1,778 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటిలో 383 సమస్యాత్మక, 819 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. వీటి వద్ద కట్టుదిట్టమైన భద్రత కోసం 20 కంపెనీల పారా మిలిటరీ బలగాలను అదికారులు రంగంలోకి దించారు. మిగిలిన ప్రాంతాల్లో 7,606 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఈ నెల 24న జరగనుంది.

  • Loading...

More Telugu News