: సుకుమార్ కు జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు!


‘హ్యాట్సాఫ్ టు కుమారి 21 ఎఫ్’ అంటూ ఆ చిత్రంపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సినిమా రిలీజ్ కు ముందు రోజే చూసిన ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. ‘కథ ఎంతో అద్భుతంగా ఉంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సుకుమార్ కు హ్యాట్సాఫ్. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, దర్శకుడు సూర్య ప్రతాప్లు రాణించారు. హీరోయిన్ హెబ్బా, హీరో రాజ్ తరుణ్ నటన బెస్ట్’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. కాగా, శుక్రవారం నాడు విడుదలైన ఈ చిత్రంపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. 'ఆర్య‌'తో ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మైన సుకుమార్ 'కుమారి 21 ఎఫ్'తో తొలిసారి నిర్మాత‌గా మారాడు. కేవ‌లం సినిమాను ప్రొడ్యూస్ చేయ‌డ‌మే కాకుండా ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే కూడా అందించాడు. ఆర్య‌, 100 % ల‌వ్ వంటి డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీస్‌ను డైరెక్ట్ చేసిన సుకుమార్ ఈ సినిమాకు మాత్రం ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్‌కు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన విషయం తెలిసిిందే.

  • Loading...

More Telugu News