: ఏఎస్సై మోహన్ రెడ్డిపై 20కి పైగా కేసులు నమోదు


కరీంనగర్ జిల్లా ఏఎస్సై మోహన్ రెడ్డికి ఉచ్చుబిగిస్తోంది. మోహన్ రెడ్డి వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ విభాగం అతనికి సహకరించిన అందరి వివరాలు సేకరించింది. మోహన్ రెడ్డికి తాకట్టుపెట్టిన ఆస్తుల విలువ 50 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆస్తుల వివరాలు రిజిస్ట్రేషన్ శాఖకు అందించిన సీఐడీ, వాటి రిజిస్ట్రేషన్లను ఆపేయాలని ఆదేశించింది. 2006లో మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును తిరగదోడింది. ఇందుకు సంబంధించి 68 మంది సాక్షులను సిద్ధం చేసింది. ఈ ఏడాది సీఐడీ నమోదు చేసిన 27 కేసుల్లో నాలుగు కేసులు మోహన్ రెడ్డివే కావడం విశేషం. మోహన్ రెడ్డి కేసులో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ ఇప్పటి వరకు ఏఎస్పీ నుంచి హోంగార్డు వరకు మొత్తం 12 మందిని సస్పెండ్ చేసింది. మరో ఇద్దరిపై చర్యలు తీసుకోనుంది. మోహన్ రెడ్డిపై 20కి పైగా కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు, ఈ కేసులో మరో ఆరుగుర్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని అధికారులు జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News