: తప్పతాగి సెక్యూరిటినీ చితకబాదిన యువతి!
తప్పతాగిన ఒక యువతి హోటల్ సెక్యూరిటీని చితకబాదిన సంఘటన జార్ఖండ్ లోని జెంషెడ్ పూర్ లో జరిగింది. ఆ యువతితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. బాగా మద్యం సేవించి ఉన్న యువతి అక్కడి ఒక హోటల్ సెక్యూరిటీ సిబ్బందిని కాలుతో తన్నడమే కాకుండా వారిపై పిడిగుద్దులు కురిపించింది. అడ్డుకునేందుకు యత్నించిన సిబ్బందిని యువతి బాయ్ ఫ్రెండ్ అడ్డుకోవడమే కాకుండా అతను కూడా దాడి చేశాడు. దీంతో వారి దగ్గరకు వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించలేకపోయారు. ఆ మార్గం ద్వారా వెళుతున్న వారు కూడా మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈ తతంగమంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.