: ‘సైజ్ జీరో’ కోసం అనుష్క బరువు పెరిగిన విధంబు ఎట్టిదనిన...!


ఈ నెల 27న విడుదల కానున్న అనుష్క తాజా చిత్రం సైజ్ జీరో. పర్ఫెక్టు ఫిజిక్ తో ఉండే అనుష్క ఈ చిత్రం కోసం బరువు బాగా పెరిగింది. బరువు పెంచుకునేందుకని ఆమె తనకు ఇష్టమైన ఆహారాన్ని ఒక రేంజ్ లో తిన్నానని చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను అనుష్క తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను అభిమానులు చాలా ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కాగా, ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో రానున్న సైజ్ జీరో చిత్రంలో అనుష్కతో పాటు ఆర్య, సోనాల్ చౌహాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

  • Loading...

More Telugu News