: కేటీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన త్రిష


తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు సినీ నటి త్రిష ధన్యవాదాలు తెలిపింది. కేటీఆర్ కు ఆమె ధన్యవాదాలు చెప్పడానికి కారణం ఏంటనేగా మీ డౌట్... వరంగల్ ఉపఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన కేటీఆర్ కు ప్రచార పర్వం ముగియడంతో కాస్తంత తీరిక చిక్కింది. దీంతో కమల్ హాసన్, త్రిష జంటగా నటించిన 'చీకటి రాజ్యం' సినిమాను ఆయన చూశారు. సినిమా చూసిన వెంటనే ట్విట్టర్ ద్వారా లెజెండరీ నటుడు కమలహాసన్, త్రిష, ప్రకాశ్ రాజ్ నటన అద్భుతమంటూ ఆయన ప్రశంసించారు. దీనిని చూసిన త్రిష, తన నటనను ప్రశంసించినందుకు ట్విట్టర్లో కేటీఆర్, సుబ్బరామిరెడ్డిలకు ధన్యవాదాలు చెప్పింది.

  • Loading...

More Telugu News