: ఫ్లయిట్ లేట్... నితీశ్ ప్రమాణ స్వీకారాన్ని మిస్ అయిన రాహుల్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడా కనిపించలేదు. అయితే ఆయన విమాన ఆలస్యం కారణంగానే రాలేకపోయారని తెలిసింది. ఈ విషయాన్ని రాహులే ట్విట్టర్ ద్వారా తెలిపారు. "ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ, దానికి సంబంధించిన కారణాల వల్ల గంటకు పైగా ఫ్లయిట్ ఆలస్యం అయింది. ఇప్పుడే పాట్నాలో లాండ్ అయ్యాను! గాంధీ మైదాన్ కు వెళుతున్నా" అని రాహుల్ మూడు గంటల సమయంలో ట్వీట్ చేశారు. అంటే 2 గంటల సమయంలో నితీశ్ ప్రమాణం చేయగా, తరువాత ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే కార్యక్రమమంతా పూర్తయింది. మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్ బీహార్ లో 41 స్థానాల్లో పోటీచేసి 27 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే.