: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చిన నివేదికల ప్రకారమే కేంద్రం ఇళ్లు మంజూరు చేసింది: కె.లక్ష్మణ్


కేంద్ర ప్రభుత్వం తాజాగా 'అందరికీ ఇళ్లు' పథకం కింద ఐదు రాష్ట్రాలకు కొత్త ఇళ్లను కేటాయించింది. అందులో ఏపీకి 1,93,147 ఇళ్లను, తెలంగాణకు 10,290 ఇళ్లను కేటాయించింది. అయితే తమకు తక్కువ కేటాయించడంపై టీఆర్ఎస్ నేతలు పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇళ్ల కేటాయింపుపై నిరసన తెలిపారు. దానిపై బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చిన నివేదికల ప్రకారమే కేంద్రం ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ఇళ్ల కేటాయింపుపై టీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేయవద్దని సూచించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలగించిన ఓట్లను మళ్లీ జాబితాలో చేర్చే వరకు పోరాడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News