: మొత్తం 10 మంది ఉగ్రవాదులు, బందీల్లో ఐరాస ప్రతినిధులు, ఫ్రాన్స్ సైన్యాధికారులు


పశ్చిమాఫ్రికా దేశాల్లో భాగమైన మాలీపై ఉగ్రవాదులు ఈ ఉదయం పంజా విసిరారు. భారీగా పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రితో మాలీ రాజధాని బొమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్ పై దాడికి దిగిన 10 మంది ఉగ్రవాదులు హోటల్ లో ఉన్న 170 మందిని బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. బందీలుగా పట్టుబడిన వారిలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, ఫ్రాన్స్ సైన్యాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. బొమాకోలో జరుగుతున్న ఓ సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాలకు చెందిన ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఉండటంతో మాలీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం హోటల్ ను చుట్టుముట్టిన భద్రతా దళాలు బందీలను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

  • Loading...

More Telugu News