: ప్రమాణస్వీకారం సందర్భంలో లాలూ పెద్ద కుమారుడి తత్తరపాటు
బీహార్ లో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ తరువాత పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించారు. ప్రమాణం చేస్తుండగా ఆయన ఓ పదాన్ని తప్పుగా పలికారు. దాన్ని వెంటనే గమనించిన గవర్నర్ రాంనాథ్ కొవింద్ ఆక్షేపించారు. మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పారు. మళ్లీ తప్పు దొర్లడంతో గవర్నర్ మరోసారి కూడా సర్ది చెప్పారు. అంతకుముందు ఆయన తమ్ముడు తేజస్వి ప్రసాద్ మంత్రిగా ఎలాంటి తప్పులు దొర్లకుండా ప్రమాణ స్వీకారం చేశారు.