: ఓట్ల తొలగింపుపై అబద్ధాలాడుతున్న భన్వర్ లాల్: మర్రి శశిధర్ రెడ్డి


తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నసీం జైదీని శుక్రవారం ఆయన కలిశారు. జీహెచ్ ఎంసీలో ఓట్ల తొలగింపు అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందాన్ని పంపినందుకుగాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకే భన్వర్ లాల్ ఇక్కడి ఓట్లను తొలగించారని ఫిర్యాదు చేశారు. భన్వర్ లాల్ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని, ఓట్ల తొలగింపుపై అబద్ధాలాడుతున్నారని ఆయనపై ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News