: రెండేళ్లు కూడా నిండని ఆ బుడతడు మహా స్పీడ్ సుమా! ఆ వీడియో మీరూ చూడండి...


రెండేళ్ల వయస్సు కూడా నిండని ఆ బుడతడి పేరు కార్టర్. ఆంగ్ల పదాలను అవలీలగా చదివేస్తాడు. సుమారు 300 పదాల వరకు నేర్చేసుకున్నాడు. ఆ పదాలలో ఏ ఒక్క పదం కనపడ్డా టక్కుమని గుర్తు పట్టేస్తాడు...చదివేస్తాడు. కార్టర్ ప్రతిభ ప్రపంచానికి తెలియడానికి కారణం అతని తండ్రే. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో నివాసముంటున్న లటోయ వైట్ సైడ్ కొడుకే కార్టర్. తన కొడుకు విద్వత్తును తెలియజెబుతున్న ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైట్ సైడ్ పోస్టు చేశాడు. దీంతో కార్టర్ గురించిన విషయం అందరికీ తెలిసింది. ఈ సందర్భంగా ఈ బుడతడి తల్లిదండ్రులు మాట్లాడుతూ, తమ కొడుకు ఏడు నెలల వయస్సు నుంచే అక్షరాలను గుర్తుపట్టేవాడని చెప్పారు. 12 నెలల వయస్సప్పుడు చిన్న చిన్న పదాలను పలకడం ప్రారంభించాడని, ఆ పదాలు పలకమని ఎవ్వరూ చెప్పకుండానే వాడంతట వాడే పలికేవాడని అన్నారు. కార్టర్ ఆసక్తిని గమనించిన తాము ఇంగ్లీషు పదాలున్న కార్డులను తీసుకొచ్చామని, వాటిని ఒకసారి చదివి వినిపించామని, వాటన్నింటినీ చాలా బాగా గుర్తుపెట్టుకున్నాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News