: జట్టు ఎంపికలో నా బాధ్యత ఉండదు: రాహుల్ ద్రవిడ్
జట్టుకు ఎంపికైన ఆటగాళ్లకు సరైన శిక్షణ ఇచ్చి, వారిని రాటు దేల్చడమే తన బాధ్యత అని అండర్-19 క్రికెట్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. జట్టు ఎంపికలో తన పాత్ర ఉండదని, జట్టులోకి ఎవర్ని ఎంపిక చేయాలన్న విషయంలో తాను కలగజేసుకోనని చెప్పాడు. తనకు ఇచ్చిన ఆటగాళ్లను సానబట్టడమే తన కర్తవ్యమని తెలిపాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ లతో భారత్ సిరీస్ ఆడుతోంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగే అండర్-19 ప్రపంచకప్ కు ఈ సిరీస్ ను సన్నాహకంగా భారత్ ఉపయోగించుకుంటోంది.