: 'మాలి'లో పేట్రేగిన ఉగ్రవాదులు... బందీలుగా 170 మంది పర్యాటకులు
పశ్చిమాఫ్రికాలోని మాలి రాజధాని బమాకో లోని ఓ హోటల్ లో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. రాడిసన్ బ్లూ హోటల్ లో చొరబడిన సాయుధులైన ఉగ్రవాదులు, హోటల్ రూంలలో ఉన్న 170 మంది పర్యాటకులను బందీలుగా చేసుకున్నారు. ఆటోమెటిక్ ఆయుధాలు, బాంబులు ధరించిన ఉగ్రవాదులు సెక్యూరిటీ గార్డులను హత్య చేసి, లోపలికి ప్రవేశించడం విశేషం. ఏడవ అంతస్తులోకి ప్రవేశించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే అప్పటికే ఉగ్రవాదులు హోటల్ లో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నారు. సిబ్బంది సమాచారంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు హోటల్ ను చుట్టుముట్టాయి. ప్రస్తుతం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. పారిస్ దాడులు జరిగిన కొద్ది రోజులకే మరోచోట భారీ దాడులకు తెరతీయడం కలకలం రేపుతోంది.