: వరంగల్ ఉపఎన్నిక బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి
వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ బందోబస్తుకు వచ్చిన ఎం.రాజు అనే పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. జిల్లాలో రఘునాథపల్లిలో డ్యూటీ నిర్వహిస్తున్న అతనికి ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 48 ఏళ్ల రాజు స్వగ్రామం మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్తఖడీం. 1993 బ్యాచ్ కు చెందిన అతనికి కొంతకాలంగా ఫిట్స్ వస్తుండేవని మరో కానిస్టేబుల్ రవీందర్ తెలిపారు. రాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పారు.